రెంజల్ మండలంలోని సాటాపూర్, బోర్గం గ్రామాలలో అంగన్వాడీ సెంటర్లను ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. ఆమెతోపాటు జడ్పిటిసి మేక విజయ సంతోష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని చిన్నారులకు తప్పకుండా పంపిణీ చేయాలని వారన్నారు. గర్భిణీ బాలింత మహిళలకు తమ ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో సేంద్రియ ఎరువులతో కూడిన ఆకుకూరలు కాయగూరలను పండించుకోవాలని ఆమె సూచించారు. ప్రతి నెల చిన్నారుల బరువులను కలిసి తగిన ఆహారాన్ని అందించాలని ఆమె అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, గర్భిణీ బాలింత మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.