నవతెలంగాణ – బజార్ హాత్నూర్
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి తోడుగా ఫసల్ భీమా యోజన పథకం అమలు చేసి పంట నష్ట పరిహారం అందేలా చేయాలని బిజెపి మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఫసల్ భీమా యోజన పథకం అమలు చేయాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలో రైతుల నుండి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా యోజన పథకం అమలు చేయక పోవడం వల్ల రైతాంగానికి తీరని నష్టo వాటిల్లుతుందని ప్రభుత్వం వెంటనే పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, రైతు భరోసా, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. రైతు ప్రభుత్వం అని చెప్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కొత్త శంకర్, జి.వి రమణ, అల్క గణేష్, సూది నందు, నానం రమణ, చట్ల ఉత్తo, మేకల వెంకన్న, గాజుల నరేష్, సూది వినాయక్, ప్రసన్న రావు, లక్ష్మణ్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఫసల్ భీమా యోజన అమలు చేయాలి: పోరెడ్డి శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



