నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సందడి కేరళంలో ప్రత్యేక నిర్ణయానికి దారి తీసింది. అర్ధరాత్రి జరిగే తుది పోరును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు ప్రతిపక్షాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రొఫెషనల్ కాలేజీలు కూడా సోమవారం మూసివేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అయితే ముందుగానే షెడ్యూల్ చేసిన పరీక్షలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ అర్ధరాత్రి తర్వాత ముగియనున్నందున మరుసటి రోజు ఉదయం విద్యార్థులు తరగతులకు హాజరుకావడం కష్టమవుతుందని ఇటీవల మాజీ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి అభిప్రాయపడ్డారు. అదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి.



