- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలాపత్తర్ పీఎస్ పరిధిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -



