Sunday, August 9, 2026
E-PAPER
Homeజాతీయంస్వాతంత్య్ర పోరాటంలోఆర్‌ఎస్‌ఎస్‌‌కు ప్రమేయం లేదు

స్వాతంత్య్ర పోరాటంలోఆర్‌ఎస్‌ఎస్‌‌కు ప్రమేయం లేదు

- Advertisement -

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఖర్గే
డెహ్రాడున్‌
: దేశ స్వతంత్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌‌కు కానీ, బీజేపీకి కానీ ఎటువంటి పాత్రాలేదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. స్వాతం త్య్రం కోసం పోరాడింది కాంగ్రెస్‌ పార్టీయేనని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేం దుకూ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో శనివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన ఆర్‌ఎస్ఎస్ బీజేపీ సభ్యులు ఒక్కరైనా ఉన్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా జైలుకు వెళ్లినా వారు తొలుత కాంగ్రెస్‌లో ఉండి ఆ తర్వాత అటువైపు వెళ్లిన వారై ఉంటారని వ్యాఖ్యానించారు. కానీ భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామ్యం లేకపోయినా బీజేపీ నేతలు దేశభక్తిపై పాఠాలు, నీతులు చెబుతుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారని ప్రశంసించారు. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆరోజు ఎంతో కీలకమైందన్నారు. డూ ఆర్ డై, క్విట్ ఇండియా నినాదాలతో మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశారని గుర్తుచేశారు. ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా పేర్కొన్న ఖర్గే, ఆ ప్రాంతానికి దేశ రక్షణలోనూ ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. కుమావోం, గర్వాల్ రెజిమెంట్లు దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందాయని చెప్పారు. దేశానికి తొలి పరమ్ వీర్ చక్ర అవార్డు అందుకున్న వీర సైనికుడు కూడా ఆ ప్రాంతం నుంచే వచ్చారని ఖర్గే పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -