Sunday, August 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ (ఎం) సీనియ‌ర్ నాయ‌కురాలు కారుపోతుల కాంత‌మ్మ మృతి

సీపీఐ (ఎం) సీనియ‌ర్ నాయ‌కురాలు కారుపోతుల కాంత‌మ్మ మృతి

- Advertisement -

​నవతెలంగాణ-తిరుమలగిరి
సూర్యాపేట జిల్లా తిరుమ‌ల‌గిరి మండ‌లానికి చెందిన సీపీఐ (ఎం) సీనియ‌ర్ నాయ‌కురాలు కారుపోతుల కాంత‌మ్మ (96) శ‌నివారం క‌న్నుమూశారు. వ‌యోభారంతో వ‌చ్చిన అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఆమె మృతి చెందారు. న‌వ‌తెలంగాణ ఎడిట‌ర్ రాంప‌ల్లి ర‌మేశ్ కు ఆమె స్వ‌యానా అమ్మ‌మ్మ‌. త‌న స్వ‌గ్రామం తాటిపాముల గ్రామంలో పార్టీని నిర్మించ‌టంలో, దాన్ని విస్త‌ర‌ణ‌లో, కుటుంబ స‌భ్య‌లంద‌ర్నీ పార్టీ స‌భ్యులుగా మ‌ల‌చ‌టంలో ఆమె క్రియాశీల‌క పాత్ర పోషించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం, కాంత‌మ్మ మంచి స్నేహితులుగా ఉండేవారు. కాంత‌మ్మ మ‌ర‌ణం ప‌ట్ల న‌వ‌తెలంగాణ సీజీఎం పి.ప్ర‌భాక‌ర్‌, బోర్డు స‌భ్యులు, మేనేజ‌ర్లు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించారు. కాంతమ్మ మృతదేహంపై గ్రామ సర్పంచ్ బోయపల్లి కిషన్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. ఆదివారం తాటిపాములలో ఆమె అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -