Saturday, September 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌పాఠశాలలో మెట్లపై దిగుతూ..

‌పాఠశాలలో మెట్లపై దిగుతూ..

- Advertisement -

అదుపుతప్పి పడిపోయిన విద్యార్థిని
ఆస్పత్రిలో చికిత్స పరిస్థితి విషమించి మృతి


​నవతెలంగాణ-షాద్ నగర్

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ ‌మండలంలోని ఇండియన్ హైట్స్ ప్రయివేటు పాఠశాలలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడి బాలిక మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖ్ నగర్ మండలం కిషన్ నగర్ శివారులోని ఇండియన్ హైట్స్ ప్రయివేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న వర్ణిక(9) గురువారం పాఠశాల సమయంలో మెట్ల పై నుంచి కిందికి తోటి విద్యార్థులతో దిగుతున్న సమయంలో కింద పడింది. వెనక నుంచి మిగతా విద్యార్థులు ఆమె వెంట వస్తున్నారు. ఈ బాలిక కింద పడటంతో తోటి విద్యార్థులు పైకి లేపారు. అపస్మారక స్థితికి చేరుకున్న విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించింది. అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది. విద్యార్థిని మృతితో పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. ఆడుతూ పాడుతూ కనిపించిన విద్యార్థిని తమ కండ్ల ఎదుట మెట్ల మీద పడి చనిపోవడం బాధాకరమని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్ణిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -