Monday, July 20, 2026
E-PAPER
Homeక్రైమ్బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో కేసులు నమోదు

బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో కేసులు నమోదు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో చోటుచేసుకున్న ఆందోళన నేపథ్యంలో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహిళలు, స్థానిక రైతులు, బీఆర్‌ఎస్‌ నేతలతోపాటు 36 మందిపై కేసులు పెట్టారు. వీరిలో పటోళ్ల కార్తిక్‌ రెడ్డి, పంతంగి భూపాల్‌రెడ్డి, మహేందర్‌, కోలన్‌ ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
విమానాశ్రయానికి, ఓఆర్‌ఆర్‌కు మధ్య బహదూర్‌గూడలో సర్వే నం.62లో 500 ఎకరాలు, సర్వే నం.28లో 150 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. కొన్ని ఏండ్లుగా స్థానికులు వాటిని సాగు చేసుకుంటున్నారు. బుల్లెట్‌ రైలు, ఆర్టీసీ బస్సు ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందనే సమాచారంతో వారం రోజులుగా రైతులు స్థానికంగా దీక్ష చేపట్టారు.
కంచె నిర్మాణాన్ని వారు అడ్డుకుంటారనే ఉద్దేశంతో హైడ్రా.. శనివారం వేకువజామున పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగింది. దీక్షా శిబిరాన్ని తొలగించి ఆ ప్రాంతంలో ఫెన్సింగ్‌ వేసింది. తమకు న్యాయం చేయాలని 8 రోజులుగా భూముల వద్ద దీక్ష చేస్తున్న రైతులు.. అక్కడికి వచ్చి హైడ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురిపై పోలీసులు కేసులు నమోదుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -