Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాగునీటి జలాలను విడుదల చేయాలి

సాగునీటి జలాలను విడుదల చేయాలి

- Advertisement -

• బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో 
నవతెలంగాణ – పెద్దవంగర
ఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి సాగునీటి జలాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, వెలిగొండ -తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే ఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి సాగునీటి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేయాలని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, ఎరువుల కొరతను వెంటనే నివారించాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, శ్రీరాం సంజయ్ కుమార్, కనుకుంట్ల వెంకన్న, శ్రీరాం సుధీర్, పాలకుర్తి యాదగిరి రావు, సుధాకర్, సర్పంచులు పటేల్ నాయక్, పరుశరాములు, వెంకన్న, నాయకులు నిమ్మల విజయం, వేణు, బిక్షపతి, అనుదీప్, రాజు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -