నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈమేరకు జేఏసీ నాయకులు బస్‌భవన్‌లోని సంబంధిత అధికారికి నోటీస్ అందజేశారు. జేఏసీ తరపునే కాకుండా అందులోని యూనియన్లు విడివిడిగా కూడా సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఈదురు వెంకన్న, థామస్‌రెడ్డి, ఎండీ మౌలానా మీడియాతో వేర్వేరుగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చిన ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోలేదని విమర్శించారు. విధిలేని పరిస్థితు ల్లోనే సమ్మె నోటీసు ఇచ్చినట్టు చెప్పారు. గతంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజ మాన్యం ఇచ్చిన హమీలను సైతం అమలుచేయలేదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కారుణ్య నియామకాలు ఇష్టానుసారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా అన్నీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో సమ్మెకు సిద్దం కావాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ సమ్మె నోటీసు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



