Tuesday, July 21, 2026
E-PAPER
Homeక్రైమ్అమీన్‌పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

అమీన్‌పూర్ మండలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

- Advertisement -

తహశీల్దార్ వెంకటేష్ ఆదేశాలతో రంగంలోకి రెవెన్యూ సిబ్బంది

ఐలాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన కట్టడాలు నేలమట్టం

అక్రమార్కులకు అధికారుల వార్నింగ్

కూల్చివేతలో పాల్గొన్న ఆర్‌ఐలు, జీపీఓలు

నవతెలంగాణ- అమీన్‌పూర్: అమీన్‌పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న పలు కట్టడాలను రెవెన్యూ అధికారులు సోమవారం భారీ బందోబస్తు నడుమ కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తున్న ఈ నిర్మాణాలపై స్థానిక తాహశీల్దార్ వెంకటేష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాహశీల్దార్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రెవెన్యూ, సిబ్బంది సదరు అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఐలాపూర్ పరిధిలో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

దీనిపై స్పందించిన తాహశీల్దార్ వెంకటేష్, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తక్షణమే కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక కూల్చివేతల కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సంగీత, మల్లికార్జున్, జిపీవోలు గోపాల్, కార్తీక్, రెవిన్యూ సిబ్బంది స్వయంగా పాల్గొని జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు.

ఈ సందర్భంగా తాహశీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ.. మండల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించినా, లేదా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు, కట్టడాలు చేపట్టినా సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు, కూల్చివేతలు కొనసాగుతాయని, ప్రజలు కూడా అనుమతులు ఉన్న స్థలాలు, నిర్మాణాలనే కొనుగోలు చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -