Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్

సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్యుమరేషన్, డాటా ఎంట్రీ ప్రక్రియకు సంబంధించిన పనులను కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య సోమవారం పరిశీలించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించి,100 శాతం సర్ పనులు పూర్తయ్యేలా సూచనలు చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ నర్సయ్య  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు బూత్ ల వారిగా తిరుగుతూ ఎన్యూమరేషన్ పారాలు నింపని ఓటర్లను గుర్తించి , ఫారాలు నింపుతూ బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు తమవంతు సహకారం అందించాలన్నారు.

మండల కేంద్రంలోని 121 బూత్ మినహా మండలం మొత్తం ఎన్యుమరేషన్ పూర్తయిందన్నారు. నియోజకవర్గం పరిధిలోని మానాల గ్రామంలో ఇంటర్నెట్ సమస్యల వల్ల డాటా ఎంట్రీ కాస్త ఆలస్యమైందని, దాదాపు రెండు రోజుల్లో 100 శాతం పూర్తయితుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్న బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, రెవెన్యూ శాఖ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి, వారికి సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, కమ్మర్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సల్లూరి గణేష్, సీనియర్ నాయకులు బుచ్చిమల్లయ్య, నిమ్మ ప్రసాద్, శివసారం గణేశ్, పడాల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -