పి ఓ డబ్ల్యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి.గోదావరి
నవతెలంగాణ-ఆర్మూర్
రాష్ట్రంలో మధ్య నిషేధాన్ని, సంపూర్ణంగా నిషేధించాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. గోదావరి పిలుపునిచ్చింది. ప్రగతిశీల మహిళా సంఘం ఏరియా జనరల్ బాడీ సమావేశం పట్టణంలోని కుమార్ నాయన భవన్ లో సోమవారం నిర్వహించినారు. సమావేశం ప్రారంభం ముందు కామ్రేడ్ ఇందిరా.. కామ్రేడ్ రమక్కకు నివాళులర్పించ్చి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పి ఓ డబ్ల్యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హాజరై మాట్లాడుతూ.. సనాతన ధర్మం పేరిట మహిళా హక్కుల్ని కాలరాస్తున్నారు. ఈ సందర్భంగా వి గోదావరి అన్నారు. ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం మహిళలకు తైలాలు పెట్టడం ఒక అనవాయితీగా మారిందని, అందులో భాగంగానే మహిళా బిల్లు ఆమోదించి సంవత్సరాలు గడుస్తున్న అమలకు పూనుకోలేదని, కాగితాలకే పరిమితం చేయడం, అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో ఒకే గొంతుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
చరిత్రలో అనేక పోరాటాల మూలంగా మహిళలకు 1893 సంవత్సరం న్యూజిలాండ్ లో ఓటు హక్కు నోచుకుందని గుర్తు చేశారు. స్వతంత్ర ఉద్యమంలో అనేక మంది మహిళలు త్యాగాలు చేశారని ఝాన్సీ రాణి త్యాగాన్ని మరణం చేసుకున్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నేటికీ మనందరికీ ఆదర్శమని గుర్తు చేశారు. మహిళలకు రక్షణ లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై దాడులు చేస్తున్నారని, పాలక వర్గాలు చూస్తూ ఫోక్సో లాంటి చట్టాలను నీరుగారుస్తున్నారని, మరోసారి మనం ఉద్యమించాల్సిన అవసరం ఉందని మహిళా రక్షణ కోసం చర్యలు తీసుకున్న విధంగా మనం ఒత్తిడి పెంచాలని అన్నారు.
ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశంలో మహిళ మహిళా బిల్లు అమలుకు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్కు జనగణకు ఎలాంటి సంబంధం లేదని ఆమోదించిన చట్టాన్ని అమలు చేయడంలో మీకేం ఇబ్బంది వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలోనే 33% అమలు చేయాలని అన్నారు. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకురాలు ఏం సత్యక్క,పి.రమ లు మాట్లాడుతూ..మన సంఘ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని, అందుగ్గాను మన సభ్యత్వం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, గ్రామ మండల కమిటీలు నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదిక పైన చేయాలని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మద్యపాన, కృత్రిమ కళ్ళు నిషేధాన్ని విధించాలని గంజాయి రవాణాను పకడ్బందీగా అమలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిపిఐ ఎఎల్ మాస్ లైన్ నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి.. ప్రభాకర్ మాట్లాడుతూ..న్యాయమైన విద్యారంగాన్ని ప్రజలకు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా, నీటి పేపర్ లాంటి లీకేజీలు స్కాములు వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు నివారణ కొరక సిజెపి ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలో ప్రజాస్వామిక వాది ,, సామాజికవేత్త సోనం వాంగ్ చుక్ మూడు వారాలకు పైగా విద్యార్థుల పోరాటాన్ని బలపరుస్తూ కేంద్ర విద్యామంత్రి డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తుంటే ఆ ప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడి చేసి వారిని ఎత్తకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఈ పోరాటాన్ని బలపరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్, లక్ష్మక్క, భాగ్య, మానస, జమున, చంద్రక్క,ఇస్తారి జ్యోతి, గౌతమి తదితరులు పాల్గొన్నారు.



