Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల అభ్యసన స్థాయిలను గుర్తించాలి

విద్యార్థుల అభ్యసన స్థాయిలను గుర్తించాలి

- Advertisement -

– మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య 
నవతెలంగాణ-కమ్మర్ పల్ల
పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన స్థాయిలను గుర్తించాలని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు తొలి మెట్టు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి  ఆంధ్రయ్య మాట్లాడుతూ .. అభ్యసనానికి చేయూత ప్రాథమిక స్థాయిలో రెమిడీయేషన్ కార్యక్రమం అన్నారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి అభ్యసన లోపాల నివారణకు ప్రత్యేక కార్యచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి, ఏవిధంగా అమలు చేసుకోవాలనే విషయాలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు రెండు విడతలుగా మూడు రోజుల చొప్పున ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. పిల్లల అభ్యసన స్థాయిలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. వాటిని పాఠశాల బోధనలో అమలు చేస్తూ విద్యార్థుల అభ్యసన లోపాలను నివారించి, విద్యార్థులందరికీ తెలుగులో, ఆంగ్లంలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయడం నేర్పించి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్ ప్రధానోపాధ్యా సాయన్న, మండల రిసోర్స్ పర్సన్స్ పసుపుల ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -