పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున్ రెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రజ్ పల్లిలో అక్రమ ఇంటి నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి హెచ్చరించారు. శాత్రజ్ పల్లిలో సింగరేణి బ్లాక్-2ను త్వరలోనే ప్రారంభిస్తారనే ప్రకటన వెలువడిన నేపథ్యంలో పల్లెలు, పట్టణాల నుంచి అక్రమంగా ఇంటి నిర్మాణాలు రాత్రికి రాత్రే వేయడంతో పంచాయతీ అధికారులు సోమవారం శాత్రజ్ పల్లిని సందర్శించి, అక్రమ ఇండ్లు వేయరాదని బోర్డు ఏర్పాటు చేశారు. శాంత్రజపల్లి గ్రామ పరిధిలో ఎవరూ అక్రమ నిర్మాణలు చేపట్టవద్దనీ, ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
శాత్రజ్ పల్లిలోఅక్రమ నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



