Tuesday, July 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థి ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు

విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు

- Advertisement -
  • ఎస్‌ఎఫ్‌ఐ

నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసనలకు సంఘీభావంగా శాంతియుత నిరాహార దీక్ష నిర్వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉద్యమాలను అణచివేయడానికి పోలీసులను ఉపయోగించడం అత్యంత దురదృష్టకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను అరెస్టు చేయించడం ద్వారా ఎవరి ప్రయోజనాలను కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

NEET, CUET తదితర పరీక్షల నిర్వహణలో తలెత్తిన తీవ్రమైన సమస్యలు, NTAపై విశ్వాస సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి చర్యలు తీసుకోవాల్సింది పోయి మౌనంగా ఉండడం దారుణం. విద్యార్థుల ప్రాణాలు పోయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అమానుషం. విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం, NTA వైఫల్యాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, NTA రద్దు వంటి డిమాండ్లతో విద్యార్థులు చేపట్టిన నిరసనలను అణచివేయడం సరికాదని మండిపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.ఢిల్లీ జంతర్ మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జీ చేయడం, వాటర్ క్యానన్లు ప్రయోగించడం వంటి అణచివేత చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమైనవి. నిరసన తెలిపే హక్కును హరించే ఇటువంటి చర్యలను ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండిస్తుంది.

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఢిల్లీ నిరాహార దీక్షకు మద్దతుగా చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ తదితరులు సంఘీభావం తెలిపారు.

అయితే, ఈ శాంతియుత కార్యక్రమాన్ని అడ్డుకుంటూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. మమత, డి. కిరణ్, కె. అశోక్ రెడ్డి, రాష్ట్ర నాయకులు విఘ్నేష్, ప్రశాంత్, అభిషేక్, నాగకృష్ణ, రవీందర్, సందీప్, ప్రవీణ్, అర్జున్, శ్వేత తదితరులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి.ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, విద్యార్థి ఉద్యమాలపై అణచివేతను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం NTAను రద్దు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించాలని మరోసారి డిమాండ్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -