- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రానికి చెందిన రావిరాల నరేష్ కుమార్ హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం తన తల్లి జ్ఞాపకార్ధంగా మండలంలోని తమ్మడపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, పెన్నులను మండల విద్యాధికారి జి.శారద చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాశంకర్, ఉపాధ్యాయులు శ్రీలత, సిఆర్పి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



