Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాల తరలింపు విరమించుకోవాలి

పాఠశాల తరలింపు విరమించుకోవాలి

- Advertisement -

-ఏంఈఓకు విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి
-గురుకులకు నూతన భవనం నిర్మించాలని సూచన 
నవతెలంగాణ-బెజ్జంకి 

సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యనందిస్తున్న బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల తరలింపు ఆలోచనను కాంగ్రెస్ నాయకులు విరమించుకోవాలని..అధికారులు పాఠశాలను కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఏంఈఓ మహతి లక్ష్మీకి విజ్ఞప్తి చేశారు.సోమవారం మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల అవరణం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులతో ఏంఈఓ మహతి లక్ష్మీతో సమావేశమయ్యారు.హుస్నాబాద్ యందు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలను మండలానికి తరలించే యోచనతో బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలను తరలించి నెలకొల్పడం పటిష్టమైన ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడమేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఏంఈఓకు వివరించారు.గురుకుల పాఠశాలకు వ్యతిరేకం కాదని..నూతన భవనం నిర్మించి మండలాన్ని విద్య హబ్ మార్చాడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక కాంగ్రెస్ నాయకులకు సూచించారు.పాఠశాల తరలింపును విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమవుతామని తల్లిదండ్రులు అధికారులను హెచ్చరించారు.సర్పంచ్ బొల్లం శ్రీధర్,ఉప సర్పంచ్ దుమాల మహేష్,వార్డు సభ్యులు తిప్పారపు మహేష్,పొట్ల శివ కుమార్, తదిరరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -