Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బట్లపల్లి గ్రామంలో భూ రీ సర్వే ప్రారంభం 

బట్లపల్లి గ్రామంలో భూ రీ సర్వే ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని బట్లపల్లి గ్రామంలో సోమవారం తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల పునఃసర్వేలో భాగంగా మొదటి దపాలో మండలంలోని బట్లపల్లి గ్రామం ఎంపికైనందున భూముల రీ సర్వే ప్రారంభించామన్నారు.సాటిలైట్ రోవర్ ద్వారా గ్రామంలో మొత్తం భూములు రీ సర్వే చేయడం జరుగుతుందన్నారు.మొదటగా గ్రామం బోర్డర్ సర్వే చేసి,తదుపరి ప్రభుత్వ ,ఫారెస్ట్,గ్రామ కంఠం,చెరువులు,శిఖం భూములు సర్వే చేసిన పిమ్మట ప్రతి రైతు భూమికి సర్వే చేసి ల్యాండ్ పార్సెల్ మ్యాప్ నంబరు కేటాయిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరసవాడ బిక్షమయ్య,సర్వేయర్,ఆర్ ఐ,జిపిఓ,గ్రామ పెద్దలు,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -