- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని శివన్నగూడ గ్రామం నుండి తేరట్ పల్లి గ్రామం వరకు 9.2 కిలోమీటర్ల మేరకు 30 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ పనులకు సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్,సర్పంచ్ లు రాపోలు యాదగిరి,కల్లేట్ల లింగయ్య,పదం రవి, భీమనపల్లి రామయ్య,సింగం వెంకటేశ్వర్లు,ఆర్ అండ్ బి అధికారులు,కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



