నవతెలంగాణ-నవాబు పేట
మండల కేంద్రములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పూర్వ విద్యార్ధులు యాదగిరి, సిద్దు, అర్షద్ లు తమ స్వంత నిధులతో లక్ష యాబైవేల రూపాయలు ఖర్చు చేసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ మాజీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన త్రాగునీటి సౌకర్యం కల్పించిన పూర్వ విద్యార్ధులు యాదగిరి సిద్దు అర్షద్ లను అభినందించారు. తాము చదువుకున్న పాఠశాలకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు పూర్వ విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం ముదిరాజ్, ఎంఈఓ నాగ్య నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి నవాజ్ రెడ్డి, నీలకంఠ, నాయకులు వాసు యాదవ్, హమీద్ మహెక్, తాణెం రాజు, నర్సింహులు, రవిందర్ రెడ్డి, కోట్ల రాజేష్, ఆనంద్, ఆంజనేయులు, మకొల్లి నర్సింహులు, చిర్ప సత్యం, బంక వెంకటయ్య, రాము, శంకర్ నాయక్, బాల్రాజ్, రవి,తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



