యాజమాన్యం ఖండన
నవతెలంగాణ – పరకాల
పరకాలలోని సాహితీ జూనియర్ కళాశాలకు ఆఫిలియేషన్ లేదంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అది పూర్తిగా అవాస్తవమని ఆ కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. గత 32 సంవత్సరాలుగా ప్రభుత్వ అన్ని అనుమతులతో ఈ కళాశాల విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కళాశాలకు సంబంధించిన రెన్యూవల్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఆఫిలియేషన్ ప్రక్రియ కొనసాగుతోందని యాజమాన్యం వెల్లడించింది. సంబంధిత శాఖ నిబంధనల ప్రకారం జూలై 31వ తేదీ వరకు ఈ ప్రక్రియకు అవకాశం ఉందని తెలిపింది. ఎంఆర్పీఎస్ కార్యదర్శి ఏకు శంకర్ కావాలనే కళాశాలపై నిరాధారమైన, మోసపూరితమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కళాశాల యథావిధిగా కొనసాగుతుందని భరోసా ఇచ్చింది. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం నేరుగా కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించాలని కోరింది.



