Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం 

ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోతున్న శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి  మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్కును ఆయన సోమవారం ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యులు పొనుగోటి అంజన్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ నాగార్జున స్కూల్స్ అధినేత విటల్ రెడ్డి, మర్రిగూడ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్, ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్, బీసి సంఘం నాయకులు పందుల రాములు గౌడ్, పగడాల లింగయ్య, బిజెపి మండల అధ్యక్షులు రాజేందర్ నాయక్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలకుపల్లి యాదయ్య, గునుగంటి యాదయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -