Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంవి.ఎస్. అచ్యుతానందన్ కు ఘన నివాళి

వి.ఎస్. అచ్యుతానందన్ కు ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ ఢిల్లీ: నేడు కేరళం మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో పూర్వ సభ్యులు వి.ఎస్. అచ్యుతానందన్ తొలి వర్ధంతి. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‌ లో వి.ఎస్.అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబి మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడిగా, కేరళ ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ కారత్, బృందా కారత్, పోలీట్ బ్యూరో సభ్యులు విజ్జు కృష్ణన్, ఆర్. అరుణ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -