Tuesday, July 21, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు

అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు

- Advertisement -

పట్టించుకోని అధికారులు..ఇబ్బందుల్లో ప్రజలు
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని రంగశివిని తండాలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి  ప్రత్యేక నిధులు మంజూరు చేసి గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు గ్రామానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి, వారికి నెల నెల గ్రామ పంచాయతీ నుంచి జీతాలు చెల్లిస్తోంది. అయినా ఇక్కడ మాత్రం ఎలాంటి పనులు చేయకుండా కార్మికులు ఇష్టాను రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదరంతో మురికి కాలువలు నిండిపోయాయి.

మురుగు వాసనతో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది గ్రామస్తులు అనేక రోగాల బారిన పడుతున్నారు. పట్టించుకోవాల్సిన పాలక వర్గం నమ్మకునీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు తీసుకుంటున్నా..పారిశుద్ధ్య పనుల తీరు చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. మరోవైపు ప్రజలు సీజనల్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయంపై మండల పంచాయతీ అధికారికి పలుమార్లు సమాచారం అందించినా వారిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వెంటనే పారిశుద్ధ్య పనులను చేపట్టి గ్రామాలను సస్యశ్యామలం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -