– కల్లులో ఉప్పు పోసిన విద్యార్థి
– విద్యార్థి ప్రవర్తన బాగాలేదని స్కూల్ నుండి టిసి ఇప్పించి ఇంటికి పంపించిన సిబ్బంది
– మందలించిన సర్పంచ్
నవతెలంగాణ-చందుర్తి : మండల కేంద్రంలోని ఎస్పీ బాలుర వసతి గృహంలో పనిచేసే ఓ మహిళా వర్కర్ తాను తాగేందుకు ప్లాస్టిక్ డబ్బాలో కల్లు తీసుకువచ్చింది. ఇది గమనించిన ఓ విద్యార్థి ఆ కల్లు లో ఉప్పు పోశాడు. దీంతో ఆ వర్కర్ కల్లు తాగకుండా చేశాడని, ఆ విద్యార్థిని మందలించడంతో పాటు విద్యార్థి ప్రవర్తన బాగాలేదని స్కూల్ నుండి టీసీపీ నుంచి స్వగ్రామం కి పంపించిన సంఘటన చెందుర్తి మండల కేంద్రంలో ని ఎస్సీ బాలురలో పది రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగు వచ్చింది.
ఈ విషయం చెందుర్తి గ్రామ సర్పంచ్ పులి సత్తయ్య దృష్టికి వెళ్ళగా సర్పంచ్ వసతిగృహం చేరుకొని ఆ వర్కర్ ను ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు పునరావతకు కావద్దని ఘాటుగా మందలించాడు. కాగా ఈ విషయంపై వసతి గృహ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ ను వివరణ కోరగా వసతి గృహంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని, నేను ఇన్చార్జి వార్డెన్ గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కాగా తల్లిదండ్రులు మాత్రం వసతి గృహం లోకి కల్లు తీసుకువచ్చి సేవించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉన్నత స్థాయి అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


