- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టెట్-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టెట్ అర్హత లేకుంటే పదోన్నతులు లభించకపోవడంతో పాటు ఉద్యోగ భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెట్ పాస్ కాని వేలాది మంది ఇన్-సర్వీస్ టీచర్లకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. నేటి నుంచి(బుధవారం) ప్రత్యేక టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. SEP 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి.
- Advertisement -



