Wednesday, July 22, 2026
E-PAPER
Homeజిల్లాలువిద్యార్థులపై లాఠీచార్జి హింసపై వెంటనే విచారణ జరిపించాలి: మంత్రి పొన్నం

విద్యార్థులపై లాఠీచార్జి హింసపై వెంటనే విచారణ జరిపించాలి: మంత్రి పొన్నం

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది..
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల్లో ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్న పార్టీగా విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ,ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీ  శాంతియుత నిరసన చేస్తున్న నాయకులను నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ అరెస్ట్ చేశారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోపాటు ముఖ్య నేతల అరెస్టులకు నిరసనగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మహా ధర్నా చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థుల లాఠీచార్జి హింసపై విచారణ జరిపించాలని ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మొన్న జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమాన్ని , సత్యాగ్రహాన్ని తలపించిందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయవాదిగా నిరసన తెలిపారన్నారు. ఇప్పటికే ఛాత్రోంకి గుంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా విద్యార్థులతో రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై మాట్లాడుతూ.. విద్యార్థుల గొంతు వినిపిస్తున్నారన్నారు.

నీట్ పేపర్ లీకేజీ కి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను మోడీ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ పై పార్లమెంట్ లో చర్చించాలని, హోంమంత్రి సమాధానం చెప్పాలన్నారు. నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్రేషియా ఇవ్వాలన్నారు. అనేక మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, కనీసం విద్యార్థుల లాఠీచార్జ్ పై హోంమంత్రి సంఘీభావం తెలపలేదన్నారు. లాఠీచార్జి కి బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తూ గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలన్నారు . దేవుడి పేరు మీద ఓట్లు అడిగే బీజేపీ అయోధ్య లో పైసలు గల్లంతు చేసి దోపిడీ చేశారన్నారు. వాళ్ళను అయోధ్య లో ముందే గ్రహించి అక్కడ బీజేపీని  గెలిపించలేదన్నారు. స్వాతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీ గా ప్రజాస్వామ్యానికి రక్ష కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. నరేంద్ర మోడీ ఇంటి ముందు శాంతియుత నిరసన చేస్తే అక్రమ అరెస్టులు చేశారని, దీనిపై నరేంద్ర మోడీ ఇంత వరకు మాట్లాడలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్ష పూరితంగా మాట్లాడుతున్నారని మండి పడ్డారు. హుస్నాబాద్ అంబేద్కర్ సాక్షిగా డిమాండ్ చేస్తున్న లాఠీచార్జి పై స్పందించాలి, నీట్ పై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తరి పద్మ, మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ బంక చందు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్న రాజు వివిధ మండలాల  అధ్యక్షులు ,సర్పంచ్ లు , మార్కెట్ కమిటీ చైర్మన్ లు , పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -