పులియబెట్టిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే! అలాగని ఇవి అతిగా పులిసినా ఆరోగ్యానికి అంత మంచివి కాదంటున్నారు నిపుణులు. తద్వారా అందులోని పోషకాలు నశించిపోవడంతో పాటు ఆ పదార్థం రుచి, వాసన.. రెండూ కోల్పోతాయంటున్నారు. ఇడ్లీ/దోసె పిండిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల పులిసే ప్రక్రియ ఆగిపోతుందని, అందుకే అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయనుకుంటారు చాలామంది. కానీ ఫ్రిజ్లో పెట్టినా పులిసే ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుందని, ఇదే పదార్థాన్ని లోలోపల పాడైపోయేలా చేస్తుందని చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు తప్పవట!
అయితే ఇలా అతిగా పులిసిన పిండిని తీసుకోవడం వల్ల కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే పిండి రుబ్బిన మూడు రోజుల్లో దాన్ని పూర్తిగా వాడేయాలని, లేదంటే ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటున్నారు.
ఎక్కువగా పులియకుండా!
ఇడ్లీ/దోసె పిండి అధికంగా పులియకుండా ఈ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
– ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పిండి కొన్ని గంటల్లోనే పులిసే అవకాశం ఉంటుంది. అదే చల్లగా ఉన్నప్పుడు గంటలు గడిచినా అది పులవదు. పిండి రెండింతలైందంటే అది చక్కగా పులిసినట్లు లెక్క. అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు తీసి ఫ్రిజ్లో పెట్టేస్తే సరిపోతుంది.
– కొంతమంది పిండి ఫ్రిజ్లో పెట్టడం మర్చిపోతుంటారు. దీనివల్ల కూడా ఎక్కువగా పులిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలారం/టైమర్ సెట్ చేసుకొని.. చెక్ చేసి మరీ పిండిని ఫ్రిజ్లో పెట్టాలి.
– పిండి బాగా చల్లగా ఉందనో లేదంటే దోసెలు వేయాలనుకున్న ప్రతిసారీ తీసి బయటపెట్టడం ఎందుకనో.. కొంతమంది నిద్ర లేవగానే ఈ బ్యాటర్ గిన్నెను ఫ్రిజ్లో నుంచి తీసి బయటపెట్టేస్తారు. దీనివల్ల కూడా ఎక్కువగా పులిసే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమున్నప్పుడే పిండిని ఫ్రిజ్లో నుంచి తీయడం మంచిది.
– మోతాదుకు మించి మినప్పప్పు ఉపయోగించినా పిండి ఎక్కువగా పులిసే అవకాశం ఉంటుందట! ఎందుకంటే మినప్పప్పు పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా వేయకుండా తగినంత మేరకే వాడేలా జాగ్రత్తపడాలి.
– మెంతులు కూడా పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా ఎక్కువగా వాడకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
పిండి అతిగా పులిస్తే…!
- Advertisement -
- Advertisement -


