Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబేడ బుడగ జంగాలకు ఇండ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

బేడ బుడగ జంగాలకు ఇండ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

- Advertisement -

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన
నవతెలంగాణ-గార్ల

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ముల్కనూర్ పంచాయతీలో నివాసం ఉంటున్న బెడ బుడగ జంగాలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పొట్ట కూటి కోసం సంచార జీవితం గడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్న అర్హులైన బెడ బుడగ జంగాలకు ఆదుకోవాలంటూ బేడ బుడగాల సంక్షేమ సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మంగపతి రావు భవనం నుంచి పట్టణ పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్ రాథోడ్, ఎంపీడీవో మంగమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి మాట్లాడుతూ.. కుటుంబాల పోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా జీవన భృతి కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బుడగ జంగాలకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వారు నివసిస్తున్న కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రయినేజీలు, మంచి నీటి సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యకాస మండల కార్యదర్శి వీపీ వెంకటేశ్వర్లు, బేడ బుడగ సంఘాల నాయకులు పస్తం సమ్మయ్య, భూతం వెంకటేష్, మెటశీ, వీరన్న, కొండపల్లి శ్రీను, కోటేశ్, కోటయ్య, శ్రీను, లక్ష్మీనారాయణ, రమేష్, బిక్షం,రవి, రాములు, రామారావు, వెంకన్న తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -