యువ హీరో శ్రీ విష్ణు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ నెం.39గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కల లు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించేలా రూపొందుతోంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సన్ని వేశాలు, అన్ని రకాల భావోద్వే గాలతో కూడిన ఓ సరికొత్త ప్రయా ణాన్ని ఈ సినిమా ఆవిష్కరిం చనుంది. ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు. యువత జీవితానికి దగ్గరగా ఉండే అంశాలతో రూపొందుతున్న ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు, కథ ఎలా ఉండ బోతుందనే విషయంపై మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. సహజమైన భావోద్వేగాలతో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భాన్ని గుర్తు చేసేలా ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హారికా సూర్యదేవర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగ వంశీ సమర్పి స్తున్నారు. సన్నీ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రతి యువకుడి జీవిత ప్రయాణానికి ప్రతీక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



