Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిలువలకు వారసురాలు..

విలువలకు వారసురాలు..

- Advertisement -

బుల్లితెరపై భావోద్వేగభరిత దృశ్యకావ్యం… అందమైన అనుబంధాలకు అపురూప ఆవిష్కరణ.. ఆస్తులకు కాదు, ఆశయాలకు వారసత్వం ఉండాలంటూ చాటే విలక్షణ ధారావాహిక ‘సీతారామయ్య గారి మనవరాలు’. ఈ మెగా డైలీ సీరియల్ వీక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్మాత శ్రీధర్ గూడూరు నిర్మాణంలో రూపొందింది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ‘చెక్కుచెదరని ఆదర్శాలతో నిర్మించిన కోట… ఆ కోటను కూల్చేయాలని సొంతవారి కుట్ర! ఈ రెండింటి నడుమ నలిగే ఆ మహా సామ్రాజ్యానికి దిక్కెవరు? రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోయిన పెద్దాయనను మనవరాలు ఎలా కాపాడుకుంది? అనే వాటికి మహేంద్ర వర్మ ఎల్.డి దీనికి అద్భుతమైన స్క్రీన్‌ప్లే అందించారు. దర్శకుడు ఆర్కే మలినేని (మలినేని రాధాకృష్ణ) మాట్లా డుతూ,’పుత్తడిబొమ్మ’, ‘స్వాతిచినుకులు’, ‘మనసంతా నువ్వే’ వంటి విజయవంతమైన సీరియల్స్ తర్వాత బుల్లితెరపై సరికొత్త సాంకేతిక విప్లవం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాం. గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా తీర్చిదిద్దాం. సొంత ఇల్లే శత్రువుగా మారిన వేళ, శిథిలమైన ఇంటికే శ్రీరామరక్షగా నిలబడే ఓ ఆడపిల్ల ధైర్యం చూసే ప్రతీ గుండెను హత్తుకుంటుంది. సుమారు 1000 ఎపిసోడ్ల పాటు సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -