Tuesday, September 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌

హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌

- Advertisement -

తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘సర్దార్’కి సీక్వెల్‌ ‘సర్దార్ 2’. ఈనెల 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిం చారు. తాజాగా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌లో గతంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం ఎదురవుతున్న ప్రమాదాన్ని కలిపి కథను ప్రజెంట్ చేశారు. మురుగన్ స్వామికి పరమ భక్తుడైన సర్దార్‌ను జపాన్‌లో జరిగే ఒక సీక్రెట్ బ్లాక్-ఆప్స్ మిషన్ కోసం రిక్రూట్ చేస్తారు. ఒక సాధారణ సీక్రెట్ ఆపరేషన్‌గా మొదలైన మిషన్ ఊహించని పరిస్థితుల్లోకి వెళ్లడంతో సర్దార్‌పై ప్రభావం పడుతుంది. ఎంతోమంది ప్రాణాలను కాపాడినప్పటికీ అతడిని ఏదో వెంటాడుతూనే ఉంటుంది. అక్కడి నుంచి కథ ప్రస్తుత కాలానికి వస్తుంది. దేశానికి ఎదురయ్యే ఒక తీవ్రమైన ముప్పు సర్దార్, అతని కొడుకు విజయ్‌ను మరో ప్రమాదకరమైన మిషన్‌లోకి తీసుకెళ్తుంది. కార్తీ మరోసారి రెండు విభిన్న పాత్రలతో అదరగొట్టారు. ఎస్.జే. సూర్య విలన్‌గా ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయన అనూహ్యమైన బిహేవియర్ కథలో టెన్షన్‌ను మరింత పెంచుతూ సినిమాపై అంచనాలను పెంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -