డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మీడియాతో ముచ్చటించారు. దర్శకులుగా సందీప్, వేణుగోపాల్ కి నార్త్, సౌత్ పోల్స్ అంత డిఫరెన్స్ ఉంది. వేణు చెప్పిన కథ మాకు బాగా నచ్చింది. ఒక సీన్ చేసుకుని రమ్మని చెప్పాం. ఆయన బాగా తెరకెక్కించాడు. ఆ సీన్ అవుట్ పుట్ చూశాక సినిమా బాగా చేస్తాడనే నమ్మకం కలిగింది. ఇది క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ నేపథ్యంగా సినిమా సాగుతుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు?, అతని లైఫ్లో ఏం జరిగింది? అతని ప్రేమ కథ ఎలా సాగింది?, వాళ్ల ఫ్రెండ్స్ లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి అనేది ఓవరాల్ గా మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. వాసుకి తన మ్యూజిక్ తో ఈ కథను బాగా బ్లెండ్ చేశాడు. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా ఆకట్టుకుంటుంది. సందీప్ సినిమా పూర్తయ్యాక ఫస్ట్ కట్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. ఈ సినిమాలో నాలుగు మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఏం జరుగుతుంది అనేది డైరెక్టర్ వేణుగోపాల్ బాగా క్యాప్చర్ చేశారు. ఎక్కడా ఫోర్స్ ఫుల్ కామెడీ ఉండదు. సహజంగా, ఆర్గానిక్ గా ఉంటూ నవ్విస్తుంది.
ప్రస్తుతం మా ఫోకస్ అంతా ‘స్పిరిట్’ మీదే ఉంది.
సరికొత్త ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



