డబ్ల్యూఆర్‌సీ3 రేసులో
వరుసగా పోడియం ఫినిష్
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎఫ్‌ఐఏ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్) వరల్డ్ ర్యాలీ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూఆర్‌సీ)లో హైదరాబాద్ డ్రైవర్ నవీన్ పులిగిల్ల హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా మూడోసారి పోడియం ఫినిష్ ప్రదర్శన కనబరిచిన నవీన్.. సీనియర్ డ్రైవర్ మూసా షెరిఫ్‌తో కలిసి జోరు కొనసాగించాడు. మంగళవారం ముగిసిన 11వ రౌండ్ ర్యాలీ డెల్ పరాగ్వేలో నవీన్, మూసా జోడీ మూడో స్తానంలో నిలిచారు. డ్యూరాన్ రేసింగ్ తరఫున బరిలోకి దిగిన నవీన్, మూసా.. 22 కఠిన రెడ్ గ్రావెల్ స్పెషల్ స్టేజ్‌లతో 357.64 కిమీ దూరాన్ని 5 గంటల 10 నిమిషాల 54.9 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచారు. అన్ని విభాగాల్లో 58 కార్లు పోటీపడగా, 44 కార్లు మాత్రమే ర్యాలీని పూర్తి చేశాయి.
నవీన్, మూసా హ్యాట్రిక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



