హిలేరియస్ బ్లాక్‌బస్టర్ ‘సామజవరగమన`ను అందించిన తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి జతకట్టారు. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్‌ను షేర్ చేశారు. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెను టీమ్‌లోకి వెల్‌కమ్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో షూటింగ్ స్పాట్‌లోని ఫన్ వైబ్‌ను చూపించారు. టీమ్ మొత్తం సరదాగా గడిపిన మూమెంట్స్‌తో ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు 2’ కంప్లీట్ డిఫరెంట్ స్టయిల్ లో కొత్త కథాంశంతో కూడిన ఫ్రెష్ స్క్రిప్ట్. కాన్సెప్ట్, హై-వోల్టేజ్ హ్యుమర్ ఎక్కువగా ఉండే కథనంతో ఈ చిత్రం నాన్-స్టాప్ వినోదాన్ని అందించబోతోంది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి రైటర్స్: భాను భోగవరపు, నందు సవిరిగణ.
సరికొత్త ఫాంటసీ ఎంటర్ టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



