Friday, July 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసిస్టెంట్ ప్రొఫెసర్ సయ్యద్ రియాజ్‌కు డాక్టరేట్

అసిస్టెంట్ ప్రొఫెసర్ సయ్యద్ రియాజ్‌కు డాక్టరేట్

- Advertisement -

హైదరాబాద్ గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి పీహెచ్.డీ పట్టా
నవతెలంగాణ-బొల్లికుంట

వరంగల్ జిల్లా బొల్లికుంటలో గల వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ రియాజ్ డాక్టరేట్ ను అందుకున్నారు. హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్.డీ.) పట్టాను పొందారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి అయిన సయ్యద్ రియాజ్.. డా. హేమారాజు పౌల్లయి పర్యవేక్షణలో “సుస్థిర నిర్మాణాల కోసం బాసిల్లస్ సబ్టిలిస్ బ్యాక్టీరియాను కలిపిన స్వీయ-మరమ్మత్తు కాంక్రీట్ యొక్క సూక్ష్మ నిర్మాణ విశ్లేషణపై ప్రయోగాత్మక అధ్యయనం” అనే అంశంపై పరిశోధన నిర్వహించి డాక్టరేట్ పట్టాను సాధించారు.

ఈ పరిశోధనలో బాసిల్లస్ సబ్టిలిస్ బ్యాక్టీరియాను ఉపయోగించి కాంక్రీట్‌లో ఏర్పడే సూక్ష్మ పగుళ్లను సహజసిద్ధంగా పూడ్చివేసే స్వీయ-మరమ్మత్తు విధానాన్ని అధ్యయనం చేశారు. ఈ సాంకేతికత ద్వారా కాంక్రీట్ బలం, మన్నిక, సేవా కాలం గణనీయంగా పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది. అంతేకాకుండా పర్యావరణహిత, సుస్థిర నిర్మాణ సాంకేతికతల అభివృద్ధికి ఈ పరిశోధన దోహదపడుతుంది. భవిష్యత్తులో ఆధునిక, మన్నికైన, తక్కువ నిర్వహణ వ్యయంతో కూడిన నిర్మాణాల అభివృద్ధికి ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడనున్నాయి.ఈ సందర్భంగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ డా. కె. ప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ డా. కె. తిరుపతి రావు, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, సహచరులు సయ్యద్ రియాజ్‌ను అభినందించారు. దేశ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని రియాజ్ తెలిపారు. డాక్టరేట్ పట్టాను అందుకోవడం పట్ల ఆయన తన సంతోషాన్ని వెలిబుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -