Friday, July 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి

ఇజ్రాయెల్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్‌లో ఓ భారతీయుడు (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున అపార్ట్‌మెంట్‌లోని ఓ గదిలో అతడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య చేసినట్లు భావిస్తున్న ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కొన్నేళ్ల క్రితం భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లిన వలస కూలీ అయిన వ్యక్తి జెరూసలెంలోని కటమోన్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. అతడితో ఉన్న వివాదం కారణంగా అనుమానితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని.. పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -