Friday, July 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలురంగారెడ్డిలో స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని మృతి

రంగారెడ్డిలో స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. యూకేజీ చదువుతున్న చిన్నారి సహస్ర స్కూల్ బస్సు కిందపడి మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గర బస్సు దిగిన తర్వాత, డ్రైవర్ బస్సును వెనక్కి తీస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -