Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలల బంద్ సంపూర్ణం..

పాఠశాలల బంద్ సంపూర్ణం..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి,యువజన సంఘాలపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో తలపెట్టిన పాఠశాలల బంద్ శుక్రవారం మండలంలో సంపూర్ణంగా విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు బొమ్మిడి సాయికృష్ణ,సంగెం మధు మండలంలోని పాఠశాలలను సందర్శించి బంద్ నిర్వహించారు. ప్రశ్నించే విద్యార్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలీసు బలగాలతో లాఠీచార్జీ ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, లాఠీచార్జీలతో ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షుడు సంగెం మధు విమర్శించారు. ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -