Saturday, July 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజాస్వామ్యంపై దమనకాండ!

ప్రజాస్వామ్యంపై దమనకాండ!

- Advertisement -

దేశరాజధాని ఢిల్లీలో
యువత పై లాఠీ ఛార్జి – దేశ
భవిష్యత్తు పై బాష్పవాయువు!
తల్లిదండ్రుల ఆశలపై పెల్లెట్ గన్స్ !!
పేరు లేని దుండగుల వీరంగం
సంస్కృతీ సంప్రదాయాల వీరులు, ఇక్కడ
అమ్మాయిల గుడ్డలు చించేశారు-
వీళ్లసలు పోలీసులేనా? లేక
పోలీసు యూనిఫాముల్లో ఆరెస్సెస్ కార్యకర్తలా?

అబద్ధాల్ని, అక్రమాల్ని శాంతియుతంగా ఎదుర్కొన్న
‘బొద్దింకలు’-ఇంకా కొట్టండని-నిలబడ్డారు.
చంపినా ఫరవాలేదని తెగబడ్డారు
బ్రిటిష్ తూటాలకు ఎదురు నిల్చిన నాటి,
స్వాతంత్య్ర పోరాట యోధులు గుర్తుకొచ్చారు –
నాటి ‘జలియన్ వాలా బాగ్’ ఉదంతం చూడలేని ఈ తరానికి
ఢిల్లీలో ఈ బీజేపీ ప్రభుత్వం, ప్రత్యక్షంగా చూపించింది.
గుజరాత్ మారణకాండ, మణిపూర్ మారణ కాండల గురించి
ఈ తరం యువతీ యువకులకు పూర్తిగా తెలిసి ఉండదు,
అందుకే ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా దాన్ని పునః ప్రసారం చేశారు
​భవిష్యత్తుకు దారులు వేయలేని ఈ ప్రభుత్వం
ప్రతిరోజూ గతాన్ని తవ్వుతూనే ఉంటుంది కదా?
ఒకప్పుడు గాంధీ అహింసను కాల్చేసిన ఈ దుండగులు
నేడు యువత శాంతి ప్రదర్శనల్ని ఆదరిస్తారా?
కనీసం వారి ఆవేదన ఏమిటో వినే ఓపిక లేని వారు ప్రశ్నకు భయపడి పార్లమెంట్ వెనక గేట్ నుండి పారిపోతారు
యువతీ యువకులపై మాత్రం లాఠీలు, తూటాలు కురిపిస్తారు.
​న్యాయం చేయడానికి న్యాయమూర్తులకు, వీడియోలు చూసే తీరిక లేదు –
వ్యవస్థలన్నీ కుప్పగూలాయని చెప్పడానికి – న్యాయదేవతకు ఇంతకన్నా సాక్ష్యం లేదు.
అసలు రాజీనామా చేయాల్సింది ప్రధాన్‌ కానే కాదు,
మొత్తం ప్రభుత్వమేనన్నది – ఈ దేశం కోరుకుంటున్నది!
– ప్రొ.దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -