ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన “కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘అదే నీవు అదే నేను’. శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ 1 మిలియన్ వ్యూస్ తో డిజిటల్ మీడియాలో దూసుకెళ్తోంది. డైరెక్టర్ వి వి వినాయక్ చేతుల మీదుగా లాంచ్ చేసిన ‘మనసా మనసా` సాంగ్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ చిత్రం నుంచి మధురమా పాటను డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేయబోతున్నారు. నటుడు తనికెళ్ల భరణి, హీరో ఆకాష్ పూరి, నటి ఇంద్రజ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు.
ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తిని పంచేలా ఈ సినిమా ఉండబోతోంది. ఇప్పటి వరకు ఎన్నో రొమాంటిక్ థ్రిల్లర్స్ వచ్చినప్పటికీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి కంటెంట్ అందరీలోనూ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు గర్వంగా ఉందని, ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని మేకర్స్ తెలిపారు. త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్, లిరిక్స్ – పూర్ణాచారి, డైలాగ్స్ – వై.అమ్మిరాజు, డీవోపీ – నిమ్మల జయపాల్ రెడ్డి, ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్, మ్యూజిక్ – కనిష్క, ప్రొడ్యూసర్ – కాండ్రేగుల గోవిందు, స్క్రిప్ట్, డైరెక్షన్ – కొండల్.
‘అదే నీవు అదే నేను’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



