విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి శ్రీమతి నందమూరి బసవతారకం శతజయంతి సందర్భంగా శుక్రవారం కుటుంబ సభ్యులు ఆమె పేరుతో ‘నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆమె జయంతి వేడుకలు జరుపుకుంటూ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను చైర్మన్ గా నందమూరి మోహనకృష్ణ, మేనేజింగ్ ట్రస్టీగా నందమూరి మోహన రూపా, ట్రస్టీలుగా నందమూరి సీమంతిని, తుమ్మల ప్రసన్నకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ,’మా అమ్మ శత జయంతి సందర్భంగా ఆమె పేరిట ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. నందమూరి తారక రామారావు సినీ రంగంలో, అలాగే ప్రజలకు సేవ చేసే రాజకీయ రంగంలో ఎన్నో చూశారు. అటువంటి నాన్న ప్రయాణాలలో అండగా నిలిచి తనదైన బాధ్యతగా మా అందరిని పెంచి, పోషిస్తూ తీర్చిదిద్దారు.
ఆమె రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. గ్రాండ్ మా హోమ్ లో మహిళా వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, అలాగే అన్నదాన కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సేవ ముందు ముందు అంచలంచెలుగా పేదవారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది. వైద్యం అలాగే ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులను ప్రోత్సహించేలా మేమే తెలుసుకొని అవసరం ఉన్నవారికి అన్ని విధాలుగా అండగా నిలబడతాంఅని తెలిపారు. 'తాతయ్య ప్రతి విషయంలో అండగా నిలిచి, ఆయన ప్రతి అడుగులో వెంట నడుస్తూ సపోర్ట్ చేసిన మా నానమ్మని గౌరవించుకుంటూ ఈ ట్రస్టు ప్రారంభించడం ఆనందంగా ఉంది అనినందమూరి మోహన రూపా అన్నారు. నందమూరి సీమంతిని మాట్లాడుతూ, ‘నేడు బసవతారకం శతజయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందిఅని చెప్పారు. తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,'ఇటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేయటం చాలా గర్వంగా ఉంది. రామారావు తన విధి నిర్వహణల వల్ల తన సొంత కుమారుడి పెళ్లికి రాలేకపోయినప్పటికీ ఆమె ఒంటరిగానే పెళ్లి బాధ్యతలు భుజంపై వేసుకుని పెళ్లి చేశారు అని అన్నారు.
మరిన్ని సేవా కార్యక్రమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



