Saturday, July 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలువైవిధ్యభరితంగా ‘నాన్న కుట్టి’

వైవిధ్యభరితంగా ‘నాన్న కుట్టి’

- Advertisement -

రీసెంట్‌గా ‘వంద దేవుళ్ళు’ అనే సందేశాత్మక చిత్రంతో అందరినీ మెప్పించిన హీరో విజయ్ ఆంటోని మరో డిఫరెంట్ కథను ఎంచుకున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము.మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహ రిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా విజయ్ ఆంటోని బర్త్ డే సందర్భంగా మరో కూల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తండ్రీ కూతుళ్లు నవ్వుతూ కనిపిస్తున్నారు.. స్కూల్‌కి వెళ్లే కూతురు.. ఆ కూతురి స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్‌ని పట్టుకుని విజయ్ సింపుల్‌ లుక్‌లో కనిపిస్తు న్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా, సహజత్వానికి దగ్గరగా ఉండే కథగా ‘నాన్న కుట్టి’ వస్తోందని ఈ పోస్టర్లను గమనిస్తే అర్థం అవుతోంది. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -