వర్ధంతి సభలో పాలడుగు భాస్కర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన నిరంతర పోరాటానికి విమలా రణదీవె ప్రతిరూపమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నివాళులర్పించారు. మహిళా కార్మికులను సంఘటితం చేయడంలో ఆమె చేసిన నిరంతర కృషి భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి బలమైన పునాదులను వేసిందని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో విమలా రణదీవె 27వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమెతోపాటు కార్మికోద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భాస్కర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అన్నిరకాల దోపిడీని అంతం చేయడం, ప్రతీ కార్మికునికి హక్కులు, గౌరవాన్ని సాధించటం, సమ సమాజాన్ని నిర్మించడం కోసం కంకణబద్ధులం కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఈశ్వర్రావు, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, రొయ్యల రాజు, ఎ. సునీత, కె. చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోరాటానికి ప్రతిరూపం విమలా రణదీవె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



