Saturday, July 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకెప్టెన్ లక్ష్మి సెహగల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

కెప్టెన్ లక్ష్మి సెహగల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

- Advertisement -

ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఆశయాలు, పోరాట సూర్తిని, ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ విలువలను కాపాడేందుకు యువత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో టీపీఎస్‌‌కేలో కెప్టెన్ లక్ష్మి సెహగల్ 14వ వర్ధంతి అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగింది. ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ లక్ష్మి సెహగల్‌ తల్లీతండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులేనన్నారు. వారి ప్రభావంతో విద్యార్థి ఉద్యమాలకు ఆకర్షితులయ్యారని గుర్తు చేశారు.
గాంధీజీ విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపులో పాల్గొన్నారని చెప్పారు. ఆమె సింగపూర్‌‌లో పేదలు, కార్మీకులకు ఉచిత వైద్య సేవలు అందించిన మహోన్నత నాయకురాలు అని కొనియాడారు. సుభాష్ చంద్రబోస్ 1943లో సింగపూర్‌‌లో ఒక సభలో మాట్లాడుతూ మహిళలు ఆజాద్ హిందూ ఫౌజ్‌‌లో చేరి పోరాటంలో భాగస్వాములు కాకపోతే స్వాతంత్ర్య సమరం అసంపూర్ణంగానే ఉంటుందని చెప్పారని గుర్తుచేశారు. ఆయన పిలుపుకు స్పందించి ఝాన్సీరాణి రెజిమెంట్‌‌కు నాయకత్వం వహించిన వీరవనిత కెప్టెన్లక్ష్మి సెహగల్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం కూడా ఆమె జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని వివరించారు. ఐద్వా వ్యవస్థాపక నాయకుల్లో ఒకరిగా మహిళ హక్కులు, సమానత్వం, కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్‌ ఆశాలత, నాయకులు జోషిలా, ప్రేమ, ఇందిర, శారద, కవిత, రేష్మ, వెంకటమ్మ, ఎల్లమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -