Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీ సిబ్బందికి కిడ్స్ అందజేత 

గ్రామపంచాయతీ సిబ్బందికి కిడ్స్ అందజేత 

- Advertisement -

వస్త్రం తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోతు కరుణా మధు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని వస్త్రం తండా గ్రామపంచాయతీ సిబ్బందికి కిడ్స్ ను అందించినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు కరుణ మధు తెలిపారు. సోమవారం సిబ్బందికి షూస్ బ్లౌస్ హెల్మెట్ మాస్క్ యూనిఫామ్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది గుగులోతు భాష, గుగులోతు నెహ్రూ, గులోతు బొంధాలు, బానోతు బాలు,కు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కిడ్స్ అందించామని అన్నారు. 

వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ కిడ్స్ ను అందిస్తున్నట్లు తెలిపారు కార్మికులు వీటిని ధరించి గ్రామంలో వివిధ రకాల పనులు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని వారికి ఈ కిడ్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానస సురేందర్ ,వార్డు సభ్యులు భూక్య బాలాజీ, గుగులోతు రమేష్, గుగులోతు శేలా, గుగులోతు మల్సూర్, గుగులోతు యాకూబ్ ,గుగులోతు రవి ,నాయకులు భోజ్య ,హరిచంద్రు ,వీరన్న, రెడ్యా, కిషన్, తోపాటు కొంతమంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -