- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో పంట కాల్వలో మునిగి ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొలుత పావని (14) నీటిలో దిగి మునిగిపోవడంతో.. ఆమెను కాపాడేందుకు రంజిత్ (15), వీరేంద్ర (19) కూడా కాల్వలోకి దిగారు. ఈ క్రమంలో వారు ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు పసలపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందినవారు.
- Advertisement -



