- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు చెందిన 13 ఏండ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉన్న సమయంలో మేనమామ, వరుసకు సోదరులైన మరో ఇద్దరు గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాలిక వసతి గృహానికి వెళ్లగా, అక్కడ ఫ్యాన్ తలకు తగిలి గాయపడటంతో విషయం బయటపడింది. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నారు.
- Advertisement -



