Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయంఅభిజిత్ దీపక్ కు టైఫాయిడ్‌

అభిజిత్ దీపక్ కు టైఫాయిడ్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీపక్ తన ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. తాను టైఫాయిడ్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసన ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా డిప్కే ఒక వీడియో సందేశాన్ని పంచుకున్నారు. “కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదని మీ అందరికీ తెలుసు. రక్త పరీక్షల రిపోర్టులు వచ్చాయి. నాకు టైఫాయిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. చికిత్స తీసుకుంటున్నాను. ప్రతిరోజూ ఉదయం ఐవీ డ్రిప్స్ ఎక్కిస్తున్నారు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ‘కాక్‌రోచ్’లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన శాంతియుత పోరాటం కొనసాగితే ప్రధాన్ రాజీనామా చేయడం ఖాయం” అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -